‘వర్జిన్ స్టోరి’ సినిమా ద్వారా ఓ కొత్త ప్రయత్నం చేశాం. ఎక్కడా అసభ్యత లేకుండా చక్కగా ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు. మంచి సినిమా తీశావని విదేశాల్లో ఉన్న మిత్రులు కూడా అభినందిస్తున్నారు’ అని చెప్పారు లగడపాటి శ్రీధర్. ఆయన తనయుడు విక్రమ్ సహిదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వర్జిన్ స్టోరి’. ప్రదీప్ బి అట్లూరి దర్శకుడు. లగడపాటి శిరీషశ్రీధర్ నిర్మించారు. ఇటీవలే విడుదలైంది. శనివారం థాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ ‘టీనేజ్‌లో ఉన్న వాళ్లకు ఈ కంటెంట్ బాగా కనెక్ట్ అవుతున్నది. అంతటా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. మా ప్రయత్నాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అన్నారు.