టాలీవుడ్ యాక్టర్లు రానా -సాయిపల్లవి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఎప్పుడు వస్తుందో మేకర్స్ సరికొత్తగా చాటింపు ద్వారా ప్రకటించారు. విరాటపర్వం టీజర్ ను ఈ నెల 18వ తారీఖున సాయంత్రం 5.04 నిమిషాలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా యూట్యూబ్లో విడుదల కాబోతుందని చాటింపు చెప్పాడు.వేసవి కానుకగా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది విరాటపర్వం.
ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్. విరాటపర్వంలో ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరితో కలిసి సురేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన కోలు కోలమ్మా కోలో సాంగ్ కు మంచి స్పందన రావడంతోపాటు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.