విరాట్ కోహ్లీతో సెల్ఫీ.. పాకిస్థాన్ అభిమాని భావోద్వేగం
దుబాయ్: ఆసియాకప్‌లో పాల్గొనేందుకు దుబాయ్ వచ్చిన టీమిండియా జట్టు గురువారం ఐసీసీ అకాడమీ స్టేడియంలో ప్రాక్టీస్ చేసింది. అయితే ఆ సమయంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ క్రికెట్ అభిమాని విరాట్‌తో సెల్ఫీ దిగేందుకు తెగ ప్రయత్నించాడు. ప్రాక్టీస్ పూర్తి చేసి లగేజీతో టీమ్ బస్సు వైపు వెళ్తున్న విరాట్ కోహ్లీని పాకిస్థాన్ అభిమాని మహమ్మద్ జిబ్రన్ వెంబడించాడు. కానీ గ్రౌండ్ సెక్యూర్టీ జిబ్రన్ను అడ్డుకున్నది. ముందు వెళ్తున్న కోహ్లీ తొలుత ఆ అభిమానిని పట్టించుకోలేదు. అయితే కోహ్లీని పేరును గట్టిగా పిలిచిన తర్వాత ఇండియన్ బ్యాటర్ వెనక్కి చూశాడు. కోహ్లీ ఆ తర్వాత జిబ్రన్ వద్దకు వచ్చి సెల్ఫీకి ఫోజు ఇచ్చాడు. విరాట్‌కు వీరాభిమాని అయిన జిబ్రన్ అక్కడ జరిగిన సంఘటనలతో సంబరపడ్డాడు. తాను విరాట్‌తో సెల్ఫీ దిగేందుకే పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు చెప్పాడు. విరాట్‌కు అభిమానిని అని, అతనో అద్భుత క్రికెటర్ అని అన్నాడు. తన రిక్వెస్ట్‌ను కోహ్లీ అంగీకరించి తనతో సెల్ఫీ దిగినట్లు జిబ్రన్ తెలిపాడు. అయితే ఈ ఘటనకు చెందిన వీడియో పాక్ టీవీ తన యూట్యూబ్‌లో పోస్టు చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

