ఒక కొండ మేకను పెద్ద డేగ వేటాడింది. దాని దృఢమైన కాళ్ల గోళ్లకు చిక్కిన ఆ మేక తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. కొండ పైనుంచి కిందకు వేగంగా పరుగెత్తి ఆ భారీ పక్షి నుంచి ప్రాణాలతో బయటపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సాధారణంగా ఈగల్స్ గాలిలో చాలా ఎత్తు వరకు ఎగురుతాయి. అంత ఎత్తు నుంచి కూడా కింద ఉన్న సూక్ష్మవైన వాటిని చూసే సామర్థ్యం వాటికి ఉంది. ఇక ఈగల్స్ పట్టు గురించి చెప్పక్కర్లేదు. 3.5 అడుగుల పొడవున్న ఈ పక్షులకు ఎనిమిది అడుగుల పొడవైన రెక్కలుంటాయి.
కాగా, ఒక కొండ మేకపై డేగ దాడి చేసిన వీడియోను రెడ్డిట్లో బుధవారం పోస్ట్ చేశారు. దాని బారి నుంచి తప్పించుకునేందుకు ఆ మేక తెగ ప్రయత్నించింది. కొండ పైనుంచి కిందకు పరుగెత్తింది. మధ్యలో బండరాయిని కూడా ఢీకొట్టింది. అయినప్పటికీ ఆ డేగ దానిని విడిచిపెట్టలేదు. ఆ రెండూ కూడా కొండ రాళ్ల మీదుగా కిందకు దొర్లాయి. చివరకు ఆ డేగ పట్టు నుంచి మేక బయటపడింది. అయితే ఆ మేకను కాపాడేందుకు మరో మేక కూడా వాటి వెంట పరుగులుతీసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.