Viral news : అతడొక ప్రభుత్వ పాఠశాల (Govt school) లో ప్రధానోపాధ్యాయుడు (Head master). తన పాఠశాలలో పనిచేస్తున్న సాటి ఉపాధ్యాయురాలి (Woman teacher) ని లైంగికంగా వేధించాడు. దాంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. టీచర్ ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు ప్రధానోపాధ్యాయుడి నుంచి వివరణ కోరారు. దాంతో విద్యాధికారి (Education officer) కార్యాలయానికి వెళ్లిన ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన వివరణతో సదరు అధికారి సంతృప్తి చెందలేదు. దాంతో ఆగ్రహించిన ప్రధానోపాధ్యాయుడు బెల్ట్ తీసుకుని అధికారిపై దాడి చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. బ్రిజేంద్ర కుమార్ వర్మ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ జిల్లాలోని మహమ్మదాబాద్ బ్లాక్‌లోగల ఓ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న ఓ మహిళను బ్రిజేంద్ర కుమార్ లైంగికంగా వేధించాడు. దాంతో ఆమె ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
మహిళా టీచర్ ఫిర్యాదు మేరకు సీతాపూర్ జిల్లాకు చెందిన ‘బేసిక్ శిక్షా అధికారి (BSA)’ అఖిలేష్ ప్రతాప్ సింగ్.. హెడ్మాస్టర్ బ్రిజేంద్ర కుమార్ నుంచి క్లారిఫికేషన్ కోరారు. దాంతో విద్యాధికారి కార్యాలయానికి వెళ్లిన బ్రిజేంద్ర కుమార్.. అధికారి అఖిలేష్ ప్రతాప్ సింగ్‌కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ బ్రిజేంద్ర ఇచ్చే వివరణతో అధికారి సంతృప్తి చెందలేదు. అతడు చేసిన పనికి తీవ్రంగా మందలించాడు.
దాంతో హెడ్మాస్టర్ బ్రిజేంద్రలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన చేతిలోని ఫైల్‌ను అధికారి టేబుల్‌పై విసిరిపారేశాడు. అంతటితో ఆగకుండా తన నడుముకున్న బెల్ట్ తీసి అధికారిపై దాడికి పాల్పడ్డాడు. ఇంతలో క్యాబిన్ బయట ఉన్న సిబ్బంది వచ్చి హెడ్మాస్టర్ను పట్టుకున్నారు. ఆ తర్వాత విద్యాధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు హెడ్మాస్టర్ బ్రిజేంద్రను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
उत्तर प्रदेश के सीतापुर में हेडमास्टर ने BSA को बेल्ट से पीटा। BSA अधिकारी ने प्रिंसिपल को एक शिकायत पर सुनवाई के लिए बुलाया था! किसी बात को लेकर हेडमास्टर और बेसिक शिक्षा अधिकारी के बीच कहासुनी हो गई. जिसके बाद गुस्साए हेडमास्टर ने अपनी बेल्ट निकालकर अधिकारी को मारना शुरू कर… pic.twitter.com/wwy1XZjQ9B
— Nedrick News (@nedricknews) September 24, 2025