IRCTC Scam Case | ఐఆర్సీటీసీ కుంభకోణం.. అక్టోబర్ 13న అభియోగాలపై కీలక తీర్పు ఇవ్వనున్న ఢిల్లీ కోర్టు..!
IRCTC Scam Case | ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు అక్టోబర్ 13న తీర్పు వెలువరించనుంది. మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తో పాటు సహా నిందితులందరినీ తదుపరి విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
IRCTC Scam Case | ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు అక్టోబర్ 13న తీర్పు వెలువరించనుంది. ఈ క్రమంలో మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తో పాటు సహా నిందితులందరినీ తదుపరి విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టును ఒక సంస్థకు అప్పగించడంలో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ విషయంలో లాలూ యాదవ్, రబ్రీ, తేజస్విపై మోసం, నేరపూరిత కుట్ర, అవినీతి ఆరోపణలు చేసినట్లు సీబీఐ ఆరోపించింది. అయితే, ఈ కేసును కొనసాగించడానికి సీబీఐ వద్ద తగిన ఆధారాలు లేవని ముగ్గురూ వాదించారు. ఈ కేసు 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న కాలం నాటిది.
రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టులను సుజాత హోటల్స్ అనే ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడంలో అక్రమాలు జరిగాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. సీబీఐ చార్జిషీట్ ప్రకారం.. 2004-2014 మధ్య పూరి, రాంచీలోని బీఎన్ఆర్ హోటల్స్‌ను భారతీయ రైల్వేల నుంచి ఐఆర్సీటీసీకి బదిలీ చేయడంలో కుట్ర జరిగిందని, ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా నిబంధనలు మార్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ హోటల్స్‌ను నిర్వహణ కోసం పాట్నాలో ఉన్న సుజాత హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు లీజుకు ఇచ్చారు. నిబంధనలు మార్చడం ద్వారా సుజాత హోటల్స్‌కు అనుకూలంగా టెండర్ ప్రక్రియను తారుమారు చేశారని సీబీఐ ఆరోపించింది. చార్జిషీట్లో ఐఆర్సీటీసీ గ్రూప్ మాజీ జనరల్ మేనేజర్లు వీకే అస్తానా, ఆర్కే గోయల్‌తో పాటు, సుజాత హోటల్స్ డైరెక్టర్లు, చాణక్య హోటల్ యజమానులు విజయ్ కొచ్చర్, వినయ్ కొచ్చర్ల పేర్లు కూడా ఉన్నాయి. డిలైట్ మార్కెటింగ్ కంపెనీ (ప్రస్తుతం లారా ప్రాజెక్ట్స్), సుజాత హోటల్స్‌లను ఛార్జిషీట్లో నిందితులుగా చేర్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

