కొత్తగా సాధించిందేమీ లేదు
రేవంత్ భేటీ కేవలం పరువు కాపాడుకునే ‘ఫేస్ సేవింగ్' చర్యే ..ఫొటోషూట్లు, సమావేశాలతో ప్రయోజనం శూన్యం.
- పక్కా కార్యాచరణతోనే నీటి హకుల రక్షణ: వినోద్‌కుమార్
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ముంబై వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి జరిపిన చర్చల్లో కొత్తగా సాధించిందేమీ లేదని, ఈ సమావేశం కేవలం ప్రభుత్వ పరువు కాపాడుకునే ఫేస్ సేవింగ్ చర్యగా మాత్రమే మిగిలిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన ఒక మీడియా చానల్‌తో మాట్లాడుతూ.. తమ్మిడిహట్టిని 152 మీటర్ల ఎత్తులో నిర్మించే అంశంపై ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీ వేస్తామని ప్రకటించడం ప్రజలను మభ్యపెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాం నుంచి మొదలుకొని ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నా యకత్వంలో పదేండ్లుగా మహారాష్ట్రతో ఇదే అంశంపై విసృ్తతంగా చర్చలు జరిగాయని అన్నారు. నాటి కాంగ్రెస్ సీఎం పృ థ్వీరాజ్ నుంచి నేటి ఫడణవీస్ వరకు గిరిజన ప్రాంతాల ముంపు దృష్ట్యా 152 మీటర్ల ఎత్తును వ్యతిరేకిస్తూ 148 మీటర్లకే మొగ్గు చూపిన విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశం కావడానికి దాదాపు మూడే ండ్లు పట్టిందని, తీరా సమావేశం అయ్యాక సమస్యను పరిషరించాల్సిందిపోయి మళ్లీ అధికారుల కమిటీ వేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవా చేశారు.
తమ్మిడిహట్టిని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి ఒకవేళ మహారాష్ట్ర అంగీకరించినా.. దాంతోనే సమస్యలన్నీ పరిషారమైనట్టు కాదని రేవంత్ సరార్ను వినోద్‌కుమార్ హెచ్చరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వైన్‌గంగ నుంచి జల్గావ్ వరకు వందల కిలోమీటర్ల మేర నీటిని తరలించే భారీ ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేస్తున్నదని గుర్తుచేశారు. కాళేశ్వరం కంటే భారీ స్థాయిలో విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాలకు నీటిని మళ్లించేందుకు ఆ రాష్ట్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని, ఆ ప్రాజెక్టులు పూర్తయితే దిగువన ఉన్న తెలంగాణకు తీవ్ర నీటి కొరత ఏర్పడే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గత పాలకుల కృషిని విస్మరించి, నేటీ భేటీనే ఏదో చారిత్రక ఘట్టంగా చిత్రీకరించే ప్రయత్నాలను మానుకొని, తెలంగాణ నీటి హకులను కాపాడేందుకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని హితవు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

