వినోద్ నువ్వుల హీరోగా నటిస్తూ, వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్ పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లోని విద్యార్థులే ఇందులో కీలక పాత్రలు పోషిస్తారని ఆయన తెలిపారు. ప్రణయ్‌రాజ్ వంగరి దర్శకుడు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్ క్లాప్ కొట్టగా, దర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు. అతిథులంతా చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. తన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులతోనే ఈ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఈ సంస్థ నుంచి మరిన్ని సినిమాలు తీస్తామని హీరో, నిర్మాత వినోద్ నువ్వుల తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: నిక్కీ, సంగీతం: లలిత్.