‘విల్లుపురం స్పార్టన్స్’.. తమిళనాడులో పతాక శీర్షికలకు ఎక్కుతున్న మహిళా కబడ్డీ బృందం. ఇందులో మొత్తం 36 మంది సభ్యులు ఉంటారు. అంతా విల్లుపురం చుట్టుపక్కల గ్రామాల్లోని పేద కుటుంబాల వారే. కోచ్ పేరు బాలమురగన్. ఆయన ఓసారి ఈ ప్రాంతంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఆట చూసేందుకు వచ్చిన బాలికలు.. తాము కూడా ఆడతామని చెప్పారు. బాలమురుగన్‌కు వాళ్లలో స్టార్ ప్లేయర్స్ కనిపించారు. శతాబ్దాల క్రితం విల్లుపురం మహిళలు యుద్ధభూమిలో పోరాటాలు చేశారు. వారిని ‘వీర స్పార్టన్ యోధులు’ అని పిలిచేవారు. అందుకే తన జట్టుకు ‘స్పార్టన్స్’ అని పేరుపెట్టాడు బాలమురుగన్. ఆ బాలికలు పట్టుదలతో ఆడుతూ వివిధ టోర్నమెంట్లలో సత్తా చాటుతున్నారు. ఎవరికివారు ప్రతిభావంతులే అయినా, ఎదుగుదలకు పేదరికంఅడ్డుగా నిలుస్తున్నది. కొందరు ఖాళీ కడుపులతోనే ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నారు. రుద్ర, మహేశ్వరి అనే బాలికలు తమిళనాడు రాష్ట్ర సీనియర్ జట్టులోనూ చోటు సాధించారు. ఓ చిన్న
పల్లెకు ఇది పెద్ద విజయమే!