కోటపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న ప్రాణహిత నది ( Pranahita River ) ముంపునకు గురి అయిన ప్రాంతాలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ (Collector Kumar Deepak ) శుక్రవారం సందర్శించారు.
మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం సిర్స గ్రామం, వేమనపల్లి మండలంలోని రాచర్ల గ్రామాలలో భారీ వర్షాల కారణంగా నెలకొన్న వరద పరిస్థితులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.నది ప్రవాహం పెరుగుతున్నందున సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.
నదిలోకి చేపల వేటకు వెళ్లవద్దని, నదిలో నాటు పడవల ప్రయాణం నిషేధించామని పేర్కొన్నారు. అనంతరం సిర్సా ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించి సూచనలు చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రాఘవేంద్రరావు, సీఐ బన్సీలాల్, ఎస్సై రాజేందర్, ఎంపీడీవో లక్ష్మయ్య, ఏవో సాయికృష్ణ, ఎంపీవో అక్తర్ మొహియోద్దీన్, ఏఈవో వైష్ణవి, సిబ్బంది పాల్గొన్నారు.