Sliver Coins : ఇసుకలో వెండి నాణేలు.. పోటీపడి ఏరుకుంటున్న జనం
Sliver Coins : ఇసుకలో వెండి నాణేలు.. |

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో వరదలు చాలా మంది ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. కానీ, ఇవి కొందరికి వరంలా మారాయి. భారీ వర్షాలకు అశోక్‌నగర్‌లోని పంచవాలి గ్రామంలోని సింధ్ నది పొంగిపొర్లుతోంది. ఆదివారం వరద కాస్త తగ్గుముఖం పట్టింది. నది తీరంలో పలువురికి ఇసుకలో వెండి నాణేలు దొరికాయి. ఈ వార్త గ్రామమంతా దవాణంలా వ్యాపించగా.. గ్రామస్తులంతా నది ఒడ్డుకు చేరి పోటీపడి మరీ నాణేలను ఏరుకుంటున్నారు. అయితే, ఈ వెండి నాణేలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. నాణేలపై బ్రిటిష్ రాణి విక్టోరియా బొమ్మలున్నాయి.
1840లో ఈస్ట్ ఇండియా కంపెనీ వీటిని ముద్రించినట్లు తెలుస్తుంది. మొదట్లో రెండు నాణేలు లభించాయి. ఆ తర్వాత గ్రామస్తులు వెతికితే ఏడెనిమిది వరకు దొరికాయి. అయితే, నాణేలు ఎక్కడి నుంచి వచ్చాయో అంతుపట్టడం లేదు. దీనిపై కొలరాస్ ఎస్డీపీఓను సంప్రదించగా.. నాణేలపై సోషల్ మీడియా ద్వారా తమకు సమాచారం తెలిసిందన్నారు. ఘటనపై దర్యాప్తు చేసేందుకు స్టేషన్ ఇన్చార్జిని పంపినట్లు తెలిపారు. అయితే, నాణేలు ఎవరో వ్యక్తి ఇంట్లో దాచి ఉండగా.. వరదలు కొట్టుకువచ్చి ఉంటాయని భావిస్తున్నారు. విలువైన పురాతన నాణేలు దొరకడంతో గ్రామస్తులంతా ఇసుకలో, నదిలో నాణేల కోసం అన్వేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Extended Ban : భారత విమానాలపై మరోసారి నిషేధం పొడగించిన కెనడా
Ujjwala 2.0 : నేడు ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని
ఒలిపింక్స్ పతక విజేతలను కలువనున్న రైతు నేత తికాయిత్
Fire broke out : కర్మాన్‌ఘాట్ కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం
TTD : తిరుమలలో ఈ నెలలో రెండుసార్లు గరుడ వాహనంపై శ్రీవారి విహారం
Flood : శ్రీశైలం, సాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

