Vijay Sethupathi | తెలుగు, తమిళంతోపాటు నార్త్‌లో కూడా సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న నటుడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. విజయ్ సేతుపతి టైటిల్ రోల్లో నటించిన మహారాజ (Maharaja) తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. మక్కళ్ సెల్వన్ 50 (VJS50)గా వచ్చిన ఈ చిత్రానికి కురంగు బొమ్మై ఫేం నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించాడు.
కాగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీక్వెల్ Maharaja 2 అప్డేట్పై ఇటీవలే క్లారిటీ ఇచ్చాడు విజయ్ సేతుపతి. నితిలన్ సామినాథన్ స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడని.. త్వరలో నరేషన్‌ను వింటానని చెప్పాడు. ఈ ప్రాజెక్టు గురించి చాలా ఎక్జయిటింగ్‌గా ఉన్నట్టు కూడా చెప్పాడు. విజయ్ సేతుపతి అభిమానులతోపాటు, ఇండస్ట్రీ సర్కిల్లో సూపర్ హైప్ పెంచేసిన మహారాజ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని తెలిసిందే.
కొంతకాలంగా విజయ్ సేతుపతి నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయాయి. ఇక మహారాజ 2తో కమ్ హిట్ ఇవ్వాలని గట్టిగా ఫిక్సయ్యాడట. ఈ క్రమంలో సీక్వెల్‌పై అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తమ ఫేవరేట్ యాక్టర్‌కు ఈ క్రేజీ సీక్వెల్ తప్పకుండా మంచి విజయాన్ని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్టును ఎప్పుడు సెట్స్‌పైకి తీసుకెళ్తాడనేది చూడాలి.
Poorna | పూర్ణ ఇంట్లో అడుగుపెట్టిన మహాలక్ష్మి.. రెండోసారి తల్లైన టాలీవుడ్ నటి
Seasonal Allergies | సీజన్ మారుతోంది.. ఈ సమయంలో వచ్చే అలర్జీల నుంచి ఇలా తప్పించుకోండి..
Uttar Pradesh | కెరీర్‌పై ఫోకస్ చేయమన్నందుకు కవల సోదరి హత్య.. 84 సార్లు కత్తితో పొడిచి చంపిన సోదరుడు