అగ్ర హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్దన’. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన ఓ ఎపిసోడ్‌ని త్వరలో ముంబైలో షూట్ చేయనున్నారు. గతంలో జరిగిన షెడ్యూల్లో ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. ఇప్పుడు మిగిలిన భాగం పూర్తి చేయనున్నారు.
ముంబైలోని స్లమ్ ఏరియా నేపథ్యంలో ఈ ఎపిసోడ్ నడుస్తుందట. సినిమాకే ఈ ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుందని ఇన్సైడ్ టాక్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు డా.రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.