బైకర్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నా
‘మొన్న ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా విషయంలో చెప్పి మరీ హిట్ కొట్టాను. ఈసారి ‘బైకర్'తో బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నా’ అని నమ్మకంగా చెప్పారు హీరో శర్వానంద్. ఆయన హీరోగా నటించిన భారీ రేసింగ్ డ్రామా ‘బైకర్'. అభిలాష్‌రెడ్డి దర్శకుడు. డా.రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు.
‘మొన్న ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా విషయంలో చెప్పి మరీ హిట్ కొట్టాను. ఈసారి ‘బైకర్’తో బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నా’ అని నమ్మకంగా చెప్పారు హీరో శర్వానంద్. ఆయన హీరోగా నటించిన భారీ రేసింగ్ డ్రామా ‘బైకర్’. అభిలాష్‌రెడ్డి దర్శకుడు. డా.రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. EPIQ, 4DX, PCX ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ట్రైలర్లో రేసర్‌గా శర్వానంద్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ మెస్మరైజ్ చేసింది. ఇందులో శర్వానంద్‌కు తండ్రిగా, గురువుగా రాజశేఖర్ నటించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతున్నది.
వారిద్దరి మధ్య భావోద్వేగాలు కథకు ప్రధానబలమని తెలుస్తోంది. మాళవిక నాయర్, అనురాగ్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. సీనియర్ హీరో రాజశేఖర్‌తో కలిసి నటించడం ఓ గొప్ప అనుభవమని, దర్శకుడు అభిలాష్ సినిమాను అద్భుతంగా తీశాడని శర్వా అన్నారు. ఈ పాత్ర తనకు బాగా నచ్చిందని డా.రాజశేఖర్ చెప్పారు. శర్వాతో కలిసి నటించడం పట్ల ఆయన ఆనందం వెలిబుచ్చారు. ఈ సినిమాలోని ప్రతి రేస్ సీన్ వెనుక ఒక మంచి ఎమోషన్ ఉంటుందని దర్శకుడు అభిలాష్ తెలిపారు. ఇంకా దిల్‌రాజ, బన్నీవాసు, మాళవిక నాయర్, సంగీత దర్శకుడు జిబ్రాన్, డీవోపీ జె.యువరాజ్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

