Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Vijay Deverakonda | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (Ranabaali) సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Vijay Deverakonda | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (Ranabaali) సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో చిత్ర యూనిట్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగే ఒక పవర్ఫుల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత ద్వయం అజయ్ – అతుల్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తుండగా, హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, సింగిల్ స్క్రీన్లు మరియు మల్టీప్లెక్స్‌లలో రణబాలి అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు వెర్షన్‌కు సంబంధించి ప్రీ-సేల్స్ ఊపందుకున్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, ఓవర్సీస్లో తొలి రోజు కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే గ్రాండ్‌గా విడుదలవుతుండగా, ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్లు అక్టోబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. సినిమాకు హైప్ విపరీతంగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అక్టోబర్ 16, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

