Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Trisha | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత సినీ దిగ్గజం ఎంజీఆర్ జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనుంది. నటుడు, దర్శక నిర్మాత జె.ఎం. బషీర్ ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రను పోషించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఆయన తాజాగా వెల్లడించారు.
Trisha | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత సినీ దిగ్గజం ఎంజీఆర్ జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనుంది. నటుడు, దర్శక నిర్మాత జె.ఎం. బషీర్ ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రను పోషించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఆయన తాజాగా వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్ర కోసం ప్రముఖ హీరోయిన్ త్రిషను సంప్రదిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ బయోపిక్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి మొదలైంది.చెన్నైలో మీడియాతో మాట్లాడిన జె.ఎం. బషీర్.. తాను తెరకెక్కించనున్న ‘పురట్చితలైవర్ డాక్టర్ ఎంజీఆర్’ బయోపిక్ వివరాలను వెల్లడించారు. గతంలో పసుంపొన్ ముత్తురామలింగ దేవర్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘పసుంపొన్ దేవర్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించిందని చెప్పారు. ఇప్పుడు ఎంజీఆర్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యానని తెలిపారు.
ఈ సినిమా చిత్రీకరణ అక్టోబర్ 17 నుంచి రామనాథపురంలో ప్రారంభం కానుందని వెల్లడించారు. ఎంజీఆర్ బాల్యం, యవ్వనం, సినీ ప్రయాణం, రాజకీయ జీవితం వంటి కీలక అంశాలకు ఇందులో చోటు కల్పించనున్నట్లు వివరించారు. ఈ చిత్రానికి సంబంధించిన దర్శకుడు, సంగీత దర్శకుడి పేర్లను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఈ బయోపిక్‌లో దివంగత జయలలిత పాత్ర అత్యంత కీలకంగా ఉండనుంది. ఈ పాత్రలో త్రిషను నటింపజేయాలని భావిస్తున్నట్లు జె.ఎం. బషీర్ తెలిపారు. ఇందుకోసం ఆమెను సంప్రదిస్తున్నామని వెల్లడించారు. అయితే త్రిష ఈ పాత్రకు అంగీకరించారా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
త్రిష, తన కుమార్తె మంచి స్నేహితులని బషీర్ పేర్కొన్నారు. ప్రస్తుతం వారిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారని తెలిపారు. జయలలిత పాత్రలో త్రిష కనిపిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ పాత్రకు త్రిష ఎంపికైనట్లు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎంజీఆర్ జీవితంతో పాటు తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పలువురు ప్రముఖుల పాత్రలు కూడా ఈ సినిమాలో ఉండనున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి పాత్రలను కూడా చూపించనున్నట్లు జె.ఎం. బషీర్ వెల్లడించారు. ఈ పాత్రల్లో ఎవరు నటిస్తారనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.ఎంజీఆర్ సినీ రంగంలో సాధించిన విజయాలు, రాజకీయాల్లో ఆయన ఎదుగుదల, జయలలితతో ఉన్న అనుబంధం వంటి అంశాలు ఈ బయోపిక్‌లో ఎలా చూపిస్తారనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఎంజీఆర్, జయలలిత పాత్రల కోసం ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

