Vijay Devarakonda | ఎవరి సపోర్ట్ లేకుండా సొంతంగా కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. సినిమా ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో ఉన్నా కూడా పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాల తర్వాతే విజయ్ దేవరకొండ రేంజ్ పెరిగింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా మారారు. ఆయనకి ఇతర రాష్ట్రాలలోను భీబత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే విజయ్ దేవరకొండకి ఇప్పటి వరకు ఎలాంటి ట్యాగ్ లేకపోవడం గమనర్హం. నిన్నగాక మొన్న ఇండస్ట్రీకి వచ్చిన హీరోలకు కూడా వాళ్ల పేర్ల ముందు ఆ స్టార్.. ఈ స్టార్ అంటూ పలు ట్యాగ్ ఉన్నా, విజయ్ దేవరకొండ పేరుకి ముందు మాత్రం ఎలాంటి ట్యాగ్ లేదు. భారీ ఇమేజ్ ఉన్నా.. విజయ్ పేరు ముందు ఎలాంటి ట్యాగ్ లేకపోవడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
అయితే లైగర్ సినిమా సమయంలో ది అనే ట్యాగ్ ఉపయోగించడంతో అది పెద్ద రచ్చగా మారింది. అయితే ది ట్యాగ్ గురించి తాజాగా విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తనకు ఏదో ఓ ట్యాగ్ ఇవ్వాలని దర్శక నిర్మాతలు ప్రయత్నించారని, కాకపోతే అది తనకిష్టం లేదన్నారు విజయ్. ఫ్యాన్స్ తనపై చూపించే ప్రేమ చాలు. వారు నన్ను నా నటనతో గుర్తుంచుకోవాలని కోరుకుంటాను. రౌడీ, సదరన్ సెన్సేషన్ ట్యాగ్‌లతో ఆడియన్స్ నన్ను పిలవగా, వాటిని నేను యాక్సెప్ట్ చేయలేదు. దాంతో లైగర్ ప్రచారంలో చిత్ర బృందం ది అనే పదాన్ని జోడించింది. అయితే ఆ ట్యాగ్ ఎవరికి లేకపోవడంతో దానిని అంగీకరించాను.
కాని తర్వాత చాలా విమర్శలు వచ్చాయి. వెంటనే టీమ్‌కి ఆ ట్యాగ్ తీసేయాలని సూచించాను అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. అయితే ది ట్యాగ్ వలన ఏ హీరో ఎదుర్కోనన్ని ఇబ్బందులు నేను ఫేస్ చేయాల్సి వచ్చింది. యూనివర్సల్ నుండి పీపుల్స్ స్టార్ వరకు చాలా ట్యాగ్ ఉన్నాయి. అలానే నా కన్న చిన్న వారు , పెద్దవారు ఈ ట్యాగ్స్ వాడుతున్నారు. ఇప్పటి వరకు ఏ ట్యాగ్ లేకుండా ఉన్న హీరోని నేనొక్కడినేనేమో అంటూ విజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.