హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ ఫలితాలు, సమాధాన పత్రాల మూల్యాంకనం(వాల్యూయేషన్) ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలు, ‘గ్లోబరీనా’ సంస్థ కాంట్రాక్ట్ కేటాయింపు సామ్‌పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణను తీవ్రతరం చేసింది.
ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు ఎదురొంటున్న ఇంటర్మీడియట్ బోర్డు మాజీ కార్యదర్శి ఏ అశోక్‌ను బుధవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆడిటింగ్ నివేదికల పరిశీలనలో భాగంగా అశోక్‌ను టెండర్ నిబంధనల సవరణలు, నిధుల మంజూరు ప్రక్రియపై ప్రశ్నించారు.