తిరుమల : భారత ఉపరాష్ట్రపతి ( Vice President ) సీ.పీ రాధాకృష్ణన్ (C.P. Radhakrishnan ) తిరుమలలో శ్రీవారిని మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు, అధికారులు ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు .
స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో రాధాకృష్ణన్‌కు పండితులు వేదాశీర్వచనం ,శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాంనారాయణరెడ్డి ,టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో చౌదరి తదితరులున్నారు.
టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు కుమార్తె ఆముక్త , కుమారుడు అవనీష్ టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.