Saindhav | టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్ (SAINDHAV). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం. ఆయన కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో భారీ యాక్షన్ హంగులతో రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలోని కీలకమైన గాయత్రి పాత్ర (Gayatri role)కు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
“సైంధవ్ యొక్క హృదయాన్ని కలవండి సైంధవ్‌లో గాయత్రి పాపగా (బేబీ సారా)ను పరిచయం చేస్తున్నానంటూ” విక్టరీ వెంకటేష్ ట్విట్టర్లో రాసుకోచ్చారు. వెంకీతో పాటు సారా నటించిన పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. కాగా ఈ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
Saindhav Gayatri
ఇక యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న సైంధవ్‌లో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui) కీలక పాత్రలో నటిస్తుండగా.. ఫీమేల్ లీడ్ రోల్లో ఆండ్రియా జెరెమియా (Andrea Jeremiah), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) నటిస్తున్నారు. సైంధవ్ చంద్రప్రస్థ (Chandraprastha) ఫిక్షనల్ పోర్ట్ ఏరియా నేపథ్యంలో సాగే స్టోరీతో సైంధవ్ తెరకెక్కుతోంది. నిహారికా ఎంటర్టైన్మెంట్స్ (Niharika Entertainments) బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి (Venkat Boinpally)ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని 2023 డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సైంధవ్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. చాలా కాలం తర్వాత వెంకటేశ్ స్టైలిష్ యాక్షన్ రోల్లో కనిపించబోతుండటంతో సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందా.. అని అభిమానులు చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
Meet the HEART of #Saindhav❤️
Introducing Baby Sara as
GAYATHRI PAPA. #SaindhavOnDec22 @Nawazuddin_S@KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @vboyanapalli @maniDop @Garrybh88 @tkishore555 @NiharikaEnt #Venky75 pic.twitter.com/TFulThdDdx— Venkatesh Daggubati (@VenkyMama) July 17, 2023