నిర్మాత బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘డేగల బాబ్జీ’. వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలింస్ పతాకంపై స్వాతిచంద్ర నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ‘కలలే కన్నానే..కలగా మిగిలేనే’ అనే లిరికల్ పాటను బండ్ల గణేష్ కూతురు ద్రిష్టి చేతుల మీదుగా విడుదల చేశారు. ఒకే ఒక పాత్ర తెరపై కనిపిస్తూ సాగుతుందీ సినిమా.