మథుర: ఉత్తరప్రదేశ్లోని మథుర (Mathura) వద్ద ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు (Thick Fog) కమ్ముకోవడంతో ప్రయాణికులతో వెళ్తున్న బస్సులు, కార్లు ఢీకొన్నాయి. దీంతో మంటలు నలుగురు సజీవదహనమయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. మరికొందరు ప్రయాణికులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై పది బస్సులు, పలు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో బస్సులకు మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడటంతో ఏడు బస్సులు, కార్లు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 11 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను గుర్తించారు. భారీ పొగమంచు కారణంగా బస్సులు ఒకదాన్ని మరొకటి ఢీ కొన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం నాలుగు బస్సులకు మంటలు అంటుకున్నాయని, అవి మిగతా వాహనాలకు అంటుకుని భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయన్నారు. అయితే క్షతగాత్రులు.. మృతుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Uttar Pradesh Chief Minister Yogi Adityanath has taken cognisance of the road accident in Mathura district and expressed condolences to the bereaved families of the deceased. The CM has instructed all agencies and officials to expedite relief efforts. CM has announced financial… https://t.co/XZD4aGFWe8
— ANI (@ANI) December 16, 2025
#WATCH | Mathura, UP | Rescue operations underway as several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/qvKDqAT5T1
— ANI (@ANI) December 16, 2025