Ram Charan | ఒకప్పుడు టాలీవుడ్లో బిజీగా ఉండే హీరోలలో మంచు మనోజ్ ఒకరు.. అయితే మధ్యలో అనుకోకుండా వచ్చిన బ్రేక్‌తో సైలెంట్ అయ్యాడు. వరుస ఫ్లాపులు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల కారణంగా దాదాపు ఐదారు ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఒక దశలో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైనట్టే కనిపించిన మనోజ్, గత ఏడాది నుంచి మళ్లీ నటనపై ఫోకస్ పెట్టాడు.ఈ ఏడాది మంచు మనోజ్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. రీఎంట్రీ మూవీగా వచ్చిన ‘భైరవం’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, ‘మిరాయ్’ మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ రెండు చిత్రాల్లోనూ మనోజ్ విలన్ పాత్రల్లో కనిపించడం విశేషం. ముఖ్యంగా ‘మిరాయ్’లో ఫుల్ లెంగ్త్ నెగెటివ్ రోల్ చేసి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. దీంతో టాలీవుడ్‌కు బలమైన విలన్ దొరికాడనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
అయితే మంచు మనోజ్ నెగెటివ్ రోల్స్‌కే పరిమితం కావడం లేదు. హీరోగా కూడా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన హీరోగా ‘డేవిడ్ రెడ్డి’ అనే సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాలేదు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రంలో రెండు స్పెషల్ క్యామియో పాత్రలు ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందులో ఒక క్యామియోను మంచు మనోజ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన తమిళ స్టార్ హీరో శింబు చేయనున్నాడని తెలుస్తోంది. మరో ప్రత్యేక పాత్ర కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను సంప్రదిస్తున్నారని సమాచారం. మనోజ్‌కు, చరణ్‌కు మంచి స్నేహం ఉండటంతో ఈ వార్తకు ప్రాధాన్యం దక్కుతోంది. అయితే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన చరణ్ ఈ దశలో క్యామియో చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. పాత్ర బలంగా ఉంటే, తన ఇమేజ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఆలోచించే అవకాశముందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
‘డేవిడ్ రెడ్డి’ ఒక పీరియడ్ ఫిలిం కావడం మరో విశేషం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఒక యోధుడి కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. హనుమరెడ్డి యక్కంటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీగా రూపొందనున్న ఈ సినిమాకు పేరున్న టెక్నీషియన్లు పని చేయనుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ చేసిన మంచు మనోజ్.. ఇప్పుడు హీరోగా ‘డేవిడ్ రెడ్డి’తో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.