అప్పుపై కొనే కంటే లీజు కారు చౌక!

రుణంపై కొనడం భారమే
వెహికల్ స్క్రాపేజీ పాలసీ నేపథ్యంలో అద్దె కార్లకు మిలీనియల్స్‌లో పెరుగుతున్న గిరాకీ
ఎనిమిదేండ్లు దాటిన కార్లకు ఫిట్నెస్ పరీక్ష తప్పనిసరి. ఇందులో విఫలమైతే ఆ కార్లు రోడ్డెక్కవు. పాసైతే సర్టిఫికెట్ కోసం 10-25% గ్రీన్ ట్యాక్స్ చెల్లించాలి. ఐదేండ్లకోసారి ఈ తంతు జరుగుతూ ఉంటుంది.
ఇక 15 ఏండ్లు దాటితే కర్బన ఉద్గారాల పరీక్ష చేయాల్సిందే. తేడా వస్తే మూలకే. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22) పార్లమెంట్లో గత నెల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెహికల్ స్క్రాపేజీ పాలసీ ప్రకటించారు.
న్యూఢిల్లీ: వాతావరణంలో వాహన కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వేళ.. పాత కార్ల వినియోగంపై అనేక ఆంక్షలు రాబోతున్నాయి. దీంతో కొత్త కార్ల కొనుగోలు, ముఖ్యంగా రుణాలపై కొనడం కంటే.. నచ్చిన కారును లీజుకు తీసుకోవడమే ఉత్తమంగా కనిపిస్తున్నది. మిలీనియల్స్ (1980-96 మధ్య జన్మించిన వారు) పోకడ ఇందుకు తగ్గట్లు ఉంటున్నది.
కారు లీజింగ్ అంటే?
మారుతి, హ్యుండాయ్, మహీంద్రా, స్కోడా, ఫోక్స్‌వాగన్, బీఎండబ్ల్యూ వంటి కార్ల కంపెనీలు ఏడాది-ఐదేండ్ల కాలపరిమితితో కోరుకున్న మోడల్స్‌ను కస్టమర్లకు లీజుకిస్తున్నాయిప్పుడు. నగరం, ఎంచుకున్న కారు రకాన్నిబట్టి నెలసరి అద్దెలుంటాయి.
కనీస డౌన్ పేమెంట్/ఎలాంటి చెల్లింపులు లేకుండానే ఆయా సంస్థలు కార్లను లీజుకిస్తున్నాయి. మారుతీ సుజుకీ నాలుగేండ్ల లీజుకు వ్యాగనార్ కోసం అన్ని పన్నులతో కలిపి నెలనెలా రూ.12,513 తీసుకుంటున్నది.
కారు మెయింటెనెన్స్, బీమా, నిరంతర మెకానిక్ సదుపాయం చార్జీలు ఇందులోనే ఉంటాయి. అలాగే ఏటా 10వేల నుంచి 25వేల కిలోమీటర్ల మైలేజీ ఆప్షన్లతో ఈ లీజును కుదుర్చుకుంటున్నది.
ఎవరికి లాభం?
కారు కొనేందుకు వాహన రుణాలపై ఆధారపడే వారికి లీజులే నయం. 2-3 ఏండ్లకోసారి పాత కార్లను మార్చి కొత్త కార్లను కొనాలనుకునేవారు లీజులను ఎంచుకోవడమే లాభదాయకం.
ముఖ్యంగా ఉద్యోగ బదిలీలు ఎక్కువగా ఉండేవారికి సొంత కారు కంటే లీజు కార్లే చౌకని నిపుణులు చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, ఇతరత్రా ఖర్చుల నుంచి బయటపడవచ్చు.
పైగా వెహికల్ స్క్రాపేజీ పాలసీతో కార్ల వినిమయ కాలం భారీగా తగ్గిపోతుండటం, ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరి కావడంతో కార్ల లీజుతో ఇవన్నీ తప్పుతాయని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
మోటార్ ఫీల్డ్‌కు జంట సవాళ్లు: కండక్టర్ల కొరత+చిప్‌ల ధరలు పైపైకి..!!
ఇండ్లకు డిస్కౌంట్ల బోనంజా.. దేశమంతా ‘డబుల్’ ప్రియారిటీ!
ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్ ఈజీ..
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- cars lease
- corona
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

