కొల్లాం: కేరళలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఓ కూరగాయల వ్యాపారిపై దాడికి దిగారు. కొల్లాంలో ఆ వ్యాపారి షాపును ధ్వంసం చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ యాత్ర కోసం 2 వేలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కానీ ఆ కూరగాయల వ్యాపారి 500 మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆ వ్యాపారిపై అటాక్ చేశారు. భారత్ జోడో యాత్ర ఫండ్ పేరుతో తమ దగ్గర నుంచి డబ్బు వసూల్ చేస్తున్నారని వ్యాపారి ఆరోపించాడు. కస్టమర్లను కూడా కార్యకర్తలు అవమానించినట్లు అతను తెలిపాడు. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ హెచ్ అనీశ్ ఖాన్ ఆ గ్యాంగ్‌లో ఉన్నట్లు వ్యాపారి ఫవజ్ ఆరోపించాడు. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ఇది అల్లరిమూకలు చేసిన పని అని, వారిపై చర్యలు తీసుకున్న్నట్లు తెలిపింది.