Veerlapalli Shankar : కేసీఆర్ ఇంటి దగ్గర చావు డప్పు కొడుతామని, తాము ఆయన చావును కోరుకుంటున్నామని నోటి దురద ప్రదర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. తాజా విచిత్రమైన వివరణ ఇచ్చారు. తాను ఫ్లోలో అలా మాట్లాడానని, తాము కేసీఆర్ చావును కోరుకోవడం లేదని మాటమార్చారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తాము ఆయనను గౌరవిస్తామని చిలుకపలుకులు పలికారు. కానీ అంతమాట మాట్లాడినందుకు కనీసం క్షమాపణ కూడా కోరలేదు.
కాగా మంగళవవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కార్యకర్తలు కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దాడి చేసేందుకు గుంపులుగుంపులుగా వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. తన పలుకరించిన మీడియా ప్రతినిధులతో పరుష వ్యాఖ్యాలు చేశారు. కేసీఆర్ చావాలని, తాము ఆయన చావును కోరుకుంటున్నామని అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర దుమారం చెలరేగుతుండటంతో ‘ఫ్లోలో అలా అన్నా’ అంటూ అతి తెలివి సమాధానం ఇచ్చారు.
కేసీఆర్ చనిపోవాలని కోరుకుంటున్నట్లు ఏదో ఫ్లోలో అన్నాను
– కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ https://t.co/BlfRqVlOP5 pic.twitter.com/Q64oKuH9K9
— Telugu Scribe (@TeluguScribe) September 9, 2026