స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రమేష్ ఉప్పు కథానాయకుడిగా నటిస్తున్న ‘వీడే మన వారసుడు’ చిత్రం ఈ నెల 18న విడుదలకానుంది. సోమవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత రమేష్ ఉప్పు మాట్లాడుతూ.. రైతుల కష్టాలను ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించామని, సమాజానికి చక్కటి సందేశాన్నందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దర్శకులు వీఎన్ ఆదిత్య, సముద్ర తదితరులు పాల్గొన్నారు. లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్, సమ్మెట గాంధీ, విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సదివే దేవేంద్ర, కథ, స్క్రీన్ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం: రమేష్ ఉప్పు.