ఈ నెల 25 నుంచి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు
ఈ నెల 25 నుంచి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి.

తిరుమల : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. ఉత్సవాలకు 24న అంకురార్పణం చేయనున్నారు. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వసంతోత్సవాలు ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో 26న స్వర్ణ రథోత్సవానికి బదులుగా తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. మూడు రోజులపాటు మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు ఆలయంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని ఊరేగిస్తారు. ఈ కారణంగా మే 24న కల్యాణోత్సవం, ఊంజలసేవ, మే 25 నుంచి 27వ తేదీ వరకు కల్యాణోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.
18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో ఈ నెల 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 10.30 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా మే 18న ఉదయం, సాయంత్రం బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవం, ఊంజలసేవను టీటీడీ రద్దు చేసింది.
ఇవి కూడా చదవండి..
Good News : 12-15 ఏళ్ల వారికీ టీకా
భారత్‌కు 15 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన ట్విట్టర్
విషాదం.. చెరువులో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లల మృతి
కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్.. మలేషియాలో జూన్ 7 వరకు లాక్డౌన్
కేరళ తొలి రెవెన్యూ మంత్రి కేఆర్ గౌరీ అమ్మ కన్నుమూత
దేశంలో కాస్త తగ్గిన కరోనా తీవ్రత.. 24గంటల్లో 3.29లక్షల కేసులు..
కరోనా ఎఫెక్ట్.. శ్రీశైలంలో కళ్యాణకట్ట మూసివేత
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

