వరుణ్‌తేజ్ నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘కొరియన్ కనకరాజు’ ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సినిమా తర్వాత ఆయన తన సోదరి నిహారిక నిర్మిస్తున్న ‘బరి’ సినిమా షూట్‌లోకి ఎంట్రీ ఇస్తారు. ‘కమిటీ కుర్రోళ్లు’ఫేం యదువంశీ ఈ సినిమాకు దర్శకుడు. పనిలోపనిగా ఆ తర్వాత చేసే సినిమాను కూడా వరుణ్‌తేజ్ లైన్లో పెట్టబోతున్నారని ఇన్సైడ్ టాక్.
ఇటీవలే వరుణ్‌కి దర్శకుడు మారుతి కథ వినిపించారట. ఈ కథ వరుణ్‌తేజ్‌కి కూడా బాగా నచ్చిందని ఫిల్మ్ వర్గాల టాక్. అయితే.. ఆయన నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు. అన్నీ కుదిరితే.. ‘బరి’ చిత్రం షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని వినికిడి. ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు? అనే విషయం తెలియాల్సిఉంది.