మాతృత్వం తప్పనిసరి కాదు!
పెళ్లయిన ప్రతి జంటకు పిల్లలు ఉండాలనే నియమం ఏమీ లేదని కథానాయిక వరలక్ష్మి శరత్‌కుమార్ స్పష్టం చేసింది. తనకు పిల్లలు వద్దని నిర్ణయించుకున్నానని పేర్కొంది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ను 2024లో వివాహమాడింది వరలక్ష్మి శరత్‌కుమార్.
పెళ్లయిన ప్రతి జంటకు పిల్లలు ఉండాలనే నియమం ఏమీ లేదని కథానాయిక వరలక్ష్మి శరత్‌కుమార్ స్పష్టం చేసింది. తనకు పిల్లలు వద్దని నిర్ణయించుకున్నానని పేర్కొంది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ను 2024లో వివాహమాడింది వరలక్ష్మి శరత్‌కుమార్. తాజాగా తన నిర్ణయం వెనకున్న కారణాలను ఆమె ఓ ఇంటర్వ్యూలో వివరించింది. ఆమె మాట్లాడుతూ ‘ పిల్లలు పుట్టరని కాదు.. పిల్లలు నాకు కావాలనిపించడం లేదు.
నా భర్త కూడా ఈ విషయంలో నా అభిప్రాయాన్ని గౌరవిస్తున్నారు. తల్లిదండ్రులుగా మారడం ఎంతో బాధ్యతతో కూడుకున్న విషయం. పిల్లల్ని పెంచడానికి ఆర్థికంగా బాగుంటే సరిపోదు. వారికి తగినంత సమయాన్ని కేటాయించడంతో పాటు ఓర్పు ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా భావోద్వేగపరమైన సంకల్పం అవసరం’ అని చెప్పుకొచ్చింది. తన భర్త నికోలాయ్ సచ్‌దేవ్‌కు తొలి వివాహం ద్వారా ఓ కుమార్తె ఉందని, ఆమెను తన సొంత కుమార్తెగానే భావిస్తానని వరలక్ష్మి శరత్‌కుమార్ పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

