అవన్నీ టైంపాస్ ముచ్చట్లు!
సోషల్‌మీడియాలో తన పారితోషికం గురించి వస్తున్న రూమర్స్‌పై కథానాయిక శ్రీనిధి శెట్టి స్పందించింది. ఒక్కో సినిమాకు తాను 8కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాననే ప్రచారం జరుగుతున్నదని, అందులో నిజంలేదని స్పష్టం చేసింది. ‘నేను చేసిన సినిమాలే చాలా తక్కువ.
సోషల్‌మీడియాలో తన పారితోషికం గురించి వస్తున్న రూమర్స్‌పై కథానాయిక శ్రీనిధి శెట్టి స్పందించింది. ఒక్కో సినిమాకు తాను 8కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాననే ప్రచారం జరుగుతున్నదని, అందులో నిజంలేదని స్పష్టం చేసింది. ‘నేను చేసిన సినిమాలే చాలా తక్కువ. అలాంటప్పుడు అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎవరిస్తారు? ఎవరో కొందరు టైంపాస్ కోసం ఇలాంటి రూమర్స్‌ను వ్యాప్తి చేస్తుంటారు. వాటిని అస్సలు పట్టించుకోవద్దు’ అని శ్రీనిధిశెట్టి వివరణ ఇచ్చింది.
ఒకవేళ డబ్బు తనకు ప్రధానమైతే ఇప్పటికే ఓ ముప్పై చిత్రాల్ని అంగీకరించేదాన్నని, కెరీర్ ఆరంభం నుంచి మంచి కథలకే ప్రాధాన్యం ఇస్తూ సినిమాల్ని ఎంపిక చేసుంటున్నానని ఈ భామ తెలిపింది. ‘కేజీఎఫ్’ ఫ్రాంఛైజీ చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైంది శ్రీనిధి శెట్టి. ఆ తర్వాత తెలుగులో హిట్-3, తెలుసు కదా వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ కన్నడ సొగసరి వెంకటేష్‌తో కలిసి ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో నటించింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్-సుకుమార్ ‘ఆర్సీ17’లో విజయ్ సేతుపతి.. కీలక పాత్రపై ఆసక్తికర ప్రచారం!
Ramagundam CP | అర్ధరాత్రి వేళ బైక్‌పై సీపీ పెట్రోలింగ్.. మంచిర్యాలలో ఆకస్మిక తనిఖీలు
Nivetha Pethuraj | ‘ఆదర్శ కుటుంబం’ కథ మొత్తం తెలియదన్న నివేదా పేతురాజ్.. ట్రోలింగ్ ఎదుర్కొంటున్న బ్యూటీ
Donald Trump | ఏఐ పదాన్ని నిషేధిస్తా : ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
విద్యుత్తు కొనుగోళ్లకు ఆత్రమెందుకు.. ఈఆర్సీకి సీనియర్ జర్నలిస్టు వేణుగోపాల్‌రావు అభ్యంతరాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

