నవీ పిళ్లై 2026 ‘శాంతి’ కిరీటం
ప్రస్తుతం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో విచారణలో ఉన్న ఒక కేసులో ఆమె న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. 1941 సెప్టెంబర్ 23న డర్బన్‌లో జన్మించిన నవీ పిైళ్లె తల్లిదండ్రులు తమిళ సంతతికి చెందిన భారతీయులు.
- భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా న్యాయవేత్తకు నోబెల్ పురస్కారం
ఓస్లో : దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి న్యాయవేత్త, ఐక్యరాజ్యసమితి(యూఎన్) మానవ హక్కుల మాజీ హైకమిషనర్ నవనీతం ‘నవీ పిళ్లై 2026 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. మారణహోమం, లైంగిక హింసకు సంబంధించిన అంతర్జాతీయ చట్టాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించడంతోపాటు శాంతి, అంతర్జాతీయ న్యాయసూత్రాల పరిరక్షణకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ప్రస్తుతం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో విచారణలో ఉన్న ఒక కేసులో ఆమె న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. 1941 సెప్టెంబర్ 23న డర్బన్‌లో జన్మించిన నవీ పిైళ్లె తల్లిదండ్రులు తమిళ సంతతికి చెందిన భారతీయులు.
వర్ణవివక్ష పాలనలో ఆమె బాల్యం గడిచింది. ఆ తర్వాత జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ, వర్ణవివక్ష వ్యతిరేక కార్యకర్తలకు న్యాయ సహాయం అందిస్తూ, మానవ హక్కులు, సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఆమె తండ్రి బస్సు డ్రైవర్‌గా చేస్తూ కుటుంబపోషణ కోసం అనేక పనులు చేసేవారు. తల్లి ఎనిమిది మంది పిల్లలను చూసుకునేవారు. పిైళ్లె యూనివర్సిటీ ఆఫ్ నాటల్‌లో చదువుకున్నారు. అనంతరం హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1967లో దక్షిణాఫిక్రాలోని నాటల్ ప్రావిన్స్‌లో న్యాయవాద వృత్తిని ప్రారంభించిన తొలి శ్వేతజాతీయేతర మహిళగా అమె గుర్తింపు పొందారు. 1973లో రాజకీయ ఖైదీలు న్యాయవాదుల సహాయం పొందే హక్కును సాధించడంలో కీలకపాత్ర పోషించారు.
రువాండా మారణహోమం కేసులో చారిత్రక తీర్పు
పిైళ్లె న్యాయ ప్రస్థానం దక్షిణాఫ్రికా హైకోర్టు నుంచి రువాండా అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వరకు విస్తరించింది. రువాండా ట్రిబ్యునల్‌లో న్యాయమూర్తిగా, అధ్యక్షురాలిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1994 రువాండా మారణహోమంలో దోషిగా తేలిన మాజీ మేయర్ జీన్ పాల్ అకాయేసుపై జరిగిన చారిత్రక విచారణలో ఆమె న్యాయమూర్తిగా ఉన్నారు. 1998లో వెలువడిన ఈ కేసు తీర్పు అంతర్జాతీయ నేర న్యాయ చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచింది.
న్యాయపాలనతోనే శాంతి సాధ్యం : నోబెల్ కమిటీ
నవీ పిైళ్లెకి న్యాయ సూత్రాల పట్ల ఆమెకున్న నిబద్ధత నార్వేజియన్ నోబెల్ శాంతి కమిటీ ప్రశంసించింది. జాతీయ నాయకులను బాధ్యులుగా నిలబెట్టడంతోపాటు బాధితులకు ఆశ కల్పించారని పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

