పరిగి: వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రానికి చెందిన వంశీకుమార్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. శనివారం సరూర్నగర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీలో వంశీ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఈ యువ ప్లేయర్ తనదైన రీతిలో సత్తాచాటాడు. జార్ఖండ్ వేదికగా ఈనెల 28 నుంచి 31 వరకు నేషనల్ కబడ్డీ చాంపియన్షిప్ జరుగనుంది.