కొవిడ్ నిబంధనల మధ్య అశ్వయుజ పౌర్ణమిన వేడుకలు
కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఈ నెల 20న మహర్షి వాల్మీకి జయంతి అయిన అశ్వయుజ పౌర్ణమిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్లు తగిన విధంగా వేడుకలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇందుకు అయ్యే ఖర్చును బీసీ సంక్షేమశాఖ బడ్జెట్ నుంచి విడుదల చేస్తారని తెలిపారు.