వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘రంగ రంగ వైభవంగా. కేతికా శర్మ నాయికగా నటిస్తున్నది. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్ పీ సంస్థ నిర్మిస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో దర్శకుడు గిరీశాయ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శుక్రవారం ‘రంగ రంగ వైభవంగా’సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మే 27న ఈ సినిమాను విడుదల చేసున్నామని, సకుటుంబంగా చూసేలా సినిమా ఉంటుందని నిర్మాత అన్నారు.