Under-19 World Cup Final : అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(175) శతక్కొట్టుడు కొట్టాడు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపి ఇంగ్లండ్ బౌలర్లకు వెన్నులో వణుకు పుట్టిస్తూ.. మెరుపు సెంచరీతో భారీ స్కోర్‌కు బలమైన పునాది వేశాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే(53), ఆఖర్లో అభిగ్యాన్ కుందు(40) సైతం దంచేశారు. ఆఖర్లో కనిష్క్ చౌహన్(37 నాటౌట్) మెరుపులతో టీమిండియా నాలుగొందలు కొట్టింది.
అజేయంగా ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టుకు అంతిమ పోరులోనూ బ్యాటర్లు కొండంత స్కోర్ అందించారు. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ వైభవ్ సూర్యవంశీ(175) విధ్వంసం సృష్టించాడు. 20 పరుగులకే ఆరోన్ జార్జ్(9) ఔటైనా.. వైభవ్ ఆకాశమే హద్దుగా ఆడుతూ కెప్టెన్ ఆయుష్ మాత్రే(53)తో కలిసి ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. బంతి గమ్యం బౌండరీయే అన్నట్టుగా చెలరేగి స్కోర్‌బోర్డును ఉరికించిన అతడు 55 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. శతకం తర్వాత కూడా జోరు తగ్గించని వైభవ్ జట్టు స్కోర్ 251వద్ద వెనుదిరిగాడు. వైభవ్ అనంతరం విహాన్ మల్హోత్రా(30), వేదాంత్ త్రివేది(32)లో అర్ధ శతక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరిని జేమ్స్ మింటో వెనక్కి పంపడంతో ఇంగ్లండ్ ఊపిరిపీల్చుకుంది.
1⃣7⃣5⃣ runs
8⃣0⃣ balls
1⃣5⃣ fours & 1⃣5⃣ sixesA marathon knock by Vaibhav Sooryavanshi on a grand stage 👏👏
India U19 283/3 after 30 overs.
Updates ▶️ https://t.co/hisult7mtv #U19WorldCup pic.twitter.com/NL2r2ux1lT
— BCCI (@BCCI) February 6, 2026
వైభవ్ ఉన్నంత సేపు రాకెట్లా పరుగెత్తిన భారత స్కోర్‌బోర్డు.. విహాన్, వేదాంత్‌లు వెనుదిరిగాక నెమ్మదించింది. అయితే.. కాస్త కుదురుకున్నాక గేర్ మార్చిన అభిగ్యాన్ కుందు(40) మన్నీ ఓవర్లో 4, 6, 4, 4తో స్కోర్ 350 దాటించాడు. ఆ తర్వాత పుంజుకున్న ప్రత్యర్ధి బౌలర్లు అంబ్రిష్(18)ను బౌల్డ్ చేయగా.. ఖిలాన్ పటేల్(3)ను సెబాస్టియన్ బోల్తా కొట్టించాడు.
The Vaibhav Sooryavanshi effect 👏 pic.twitter.com/nLmP8TX7UV
— ESPNcricinfo (@ESPNcricinfo) February 6, 2026
అనంతరం కనిష్క్ చౌహన్(27 నాటౌట్), హెనిల్ పటేల్(5), జతగా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లతో టీమిండియా 400ల మార్క్ చేరింది. టాపార్డర్, మిడిలార్డర్ రాణించగా ప్రత్యర్ధికి 412 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది మాత్రే సేన.