కొండాపూర్, మే14: సంగారెడ్డి జిల్లా (Sangareddy) కొండాపూర్ మండలంలో ప్రకృతి వనరులైన వాగులు, చెరువుల ఆక్రమణలు జోరుగా సాగుతోంది. అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో రియల్టర్లు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొండాపూర్ మండలంలోని గంగారంలో నూతనంగా ఒక వెంచర్‌ను ఏర్పాటు చేసేందుకు అక్రమాలకు తెరలేపారు. అయితే వెంచర్‌కు ఆనుకొని ఉన్న 200 మీటర్ల నాలా కింద ఉన్న రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ.. దాదాపు 100 మీట్లకు వరకు దానిని పూర్తిగా పూడ్చి వేశారు.
దీంతో గత కొన్నేండ్లుగా వాగు కింద పొలాలు సాగుచేస్తున్న రైతుల ఆశలకు గండికొట్టారు. వాగును ఆనుకోని ఉన్న సర్వే నంబర్ 16, 17లో దాదాపు 11 ఎకరాలల్లో వెంచర్ నిర్మాణానికి రియల్టర్లు ఏర్పట్లు చేస్తున్నారు. దీనికోసం సగానిపైగా కాలువను పూడ్చేశారు. నీటిపారుదల శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నాలాను పూడ్చి వేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంచర్ యాజమాన్యం కాలువలు, వాగులు పూడ్చి వేసి రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. జంగమోని ఓడుక నుంచి కిందికి వచ్చే నీరుకు బ్రీడ్జీలు, వంతెనలు నిర్మిస్తున్నారు. మరోవైపు అందులో ఉన్న పిల్ల కాలువలను కూడా మూసివేసి నీటీ వనరుణలను కబ్జాచేసినప్పటికీ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇదే విషయమై కొండాపూర్ మండల అధికారులకు వివరణ కోరగా సమాధానం దాటవేస్తున్నారు.
కాలువను యధావిధిగా ఏర్పాటు చేయాలి..
కాలువను పూడ్చి వేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటారని గంగారం గ్రామానికి చెందిన ఎం గోపాల్ చెప్పారు. ఈ కాలుపై 300 మీటర్ల వరకు సీసీ నిర్మాణ పనులు చేపట్టారు. దాదాపు 200 మీటర్లు ఉన్న నాలను 100 మీటర్ల మేర పూర్తిగా పూడ్చి వేశారు. నాలపై ఎలాంటి పనులు చేయోద్దని ఎన్ని సార్లు చెప్పినా వారు తమకేమి పట్టనట్లుగా పనులను చేసుకుంటు ముందుకు సాగుతున్నారు.