మల్కాజిగిరి, నవబంర్ 22: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ సోమవారం ప్రారంభ మైంది. మొదటి రోజు 633 మందికి టీకా వేశారు. కరో నా మహమ్మారిని పూర్తిగా నియంత్రించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇంటింటికీ ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. కాలనీలు, బస్తీల్లో ఇంటింటికీ తిరిగి రెండు డోస్‌లు వేసుకున్నవారు ఎంతమంది ఉన్నారు?.. ఇప్పటి వరకు టీకాలు వేసుకోని వారు ఎంతమంది ఉన్నారు?.. సర్వే చేపట్టి.. మొదటి డోస్ వేసుకుని రెండో డోస్ వేసుకోని వారికి, మొదటి డోస్ కూడా వేసుకోనివారిని గుర్తించి వారికి టీకాలు వేయనున్నారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని మొత్తం 312కాలనీల్లో 1,03,198 ఇండ్లలో ఈ నెల 22నుంచి డిసెంబర్ 1వరకు పది రోజులు విస్తృతంగా సర్వే నిర్వహించనున్నారు.
సర్వే, వ్యాక్సినేషన్ కోసం సర్కిల్ పరిధిలోని మల్కాజిగిరి, మౌలాలి, ఈస్ట్ ఆనంద్‌బాగ్, గౌతంనగర్, వినాయక్‌నగర్, నేరేడ్మెట్ డివిజన్లలో ప్రతి డివిజన్‌కు ఏఈని నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని నేరేడ్మెట్ డివిజన్లో 117కాలనీల్లో 29,028ఇండ్లు, వినాయక్‌నగర్‌లో 34కాలనీల్లో 18,677ఇండ్లు, మౌలాలిలో 54 కాలనీల్లో 14,894 ఇండ్లు, ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో 41కాలనీల్లో 14,168 ఇండ్లు, మల్కాజిగిరిలో 35 కాలనీల్లో 12,053ఇండ్లు, గౌతంనగర్‌లో 31కాలనీల్లో 14,378ఇండ్లలో ఇంటింటికీ సర్వేచేసి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ పూర్తి అయిన ఇండ్లకు స్టిక్కర్లను వేయనున్నారు. 74మంది అధికారులతో పాటు విద్యాశాఖ, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు.
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి..
వ్యాక్సిన్ వేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు పూర్తి వివరాలు తెలిపి.. వ్యాక్సిన్ వేసుకోవాలి. అపోహలు ఉంటే ఆరోగ్య కార్యకర్తలు అవగాహన కల్పిస్తారు. ఇప్పటికే మల్కాజిగిరి నియోజకవర్గంలో చాలా కాలనీల్లో వందశాతం వ్యాక్సిన్ తీసుకున్నవారిని అభినందిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు కాలనీల్లో ఆరోగ్యశాఖ సిబ్బంది వచ్చినప్పుడు వారికి బస్తీలు, కాలనీల గల్లీల వివరాలు తెలుపడానికి సహకరించాలి.
కాలనీల్లో ప్రత్యేక కేంద్రాలు..
కరోనా వ్యాక్సినేషన్ అందరికీ అందుబాటులో ఉంచడానికి కాలనీలు, బస్తీల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. పది రోజుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం. వ్యాక్సినేషన్ పట్ల కొందరికి అపోహలు ఉన్నా యి. వారికి అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ వేయనున్నాం.