హైదరాబాద్/అమీర్పేట, జూలై 14 (నమస్తే తెలంగాణ) : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వినియోగంపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలను భర్తీచేయడానికి కాకుండా మానవ సామర్థ్యాలను మరింత మెరుగుపరిచేందుకు మాత్రమే ఈ సాకేతికతను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని హోటల్ మారియట్లో బిక్స్ దేశాల ట్రేడ్ యూనియన్ ఫోరం 15వ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాండవీయ ప్రసంగిస్తూ.. కార్మిక సంక్షేమమే దేశాభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 20-30 ఏండ్ల క్రితం స్థాపించబడిన ప్రైవేట్ స్కూళ్లకు అగ్నిమాపకశాఖ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసొసియేషన్ (ట్రస్మా) కోరింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర విపత్తు, అగ్నిమాపక సేవల శాఖ డీజీకి వినతిపత్రం సమర్పించింది.