హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): లక్డీకపూల్‌లోని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం కార్యాలయాన్ని బుధవారం అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయ సిబ్బంది సందర్శించారు. అమెరికన్ సిటిజన్ సర్వీసెస్ చీఫ్ స్టీఫెన్ విల్గర్ నేతృత్వంలోని బృందం సభ్యులతో అడిషనల్ డీజీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి సమావేశమయ్యారు. ఎన్నారై వివాహ సంబంధ కేసుల్లో బాధితులకు తగిన సాయం అందించడంలో పరస్పర సహకరించుకోవడంపై ఈ భేటీలో చర్చించారు.