వాషింగ్టన్, నవంబర్ 23: అమెరికాలో కరోనా మళ్లీ పంజా విసురుతున్నది. 15 రాష్ర్టాల్లోని ఐసీయూల్లో కరోనా రోగులే అధికంగా ఉన్నారు. వీరి సంఖ్య గత ఏడాది కంటే ఎక్కువ ఉంది. ముఖ్యంగా కొలరాడో, మిన్నెసొటా, మిషిగాన్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంది. కరోనా రోగుల తాకిడితో దవాఖానలపై ఒత్తిడి పెరుగుతున్నది. ఇతర ప్రాణాంతక వ్యా ధులతో బాధపడుతున్నవారికి వైద్య సేవలు అందించలేకపోతున్నామని వైద్య వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లు విస్తృతంగా లభ్యమవుతున్నప్పటికీ కరోనా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో మూడు నెలలుగా రోజూ సగటున వెయ్యి కరోనా మరణాలు నమోదవుతున్నాయి.