రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ‘టెక్ల్సా’ పేరుతో సినిమా రూపొందనున్నది. కన్నన్ రవి నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం చెన్నైలో ఘనంగా మొదలైంది. పలువురు తమిళ చిత్రరంగ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
జై, సురాజ్, వెంజరమూడు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ఆనంద్‌రాజ్, జి.ఎం.సుందర్, జార్జ్ మారియన్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, సహ నిర్మాత: దీపక్ రవి, నిర్మాణం: కన్నన్ రవి గ్రూప్.