రష్యా నుంచి వైదొలిగిన అమెరికా రాయబారి
రష్యా నుంచి అమెరికా రాయబారి జాన్ సుల్లివన్ వైదొలిగారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది కీలక నిర్ణయంగా నిపుణులు భావిస్తున్నారు.

వాషింగ్టన్ : రష్యా నుంచి అమెరికా రాయబారి జాన్ సుల్లివన్ వైదొలిగారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది కీలక నిర్ణయంగా నిపుణులు భావిస్తున్నారు. అమెరికా రాయబార కార్యాలయం ఈ సమాచారం ఇచ్చింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేంతవరకు జాన్ సుల్లివన్ తాత్కాలికంగా అమెరికాలో ఉంటారని రాయబార కార్యాలయం తెలిపింది.
గత వారం జో బైడెన్ ప్రభుత్వం 10 మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. రష్యాలోని మూడు డజన్లకు పైగా అధికారులు, సంస్థలపై ఆంక్షలు విధించింది. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నదని, ఫెడరల్ ఏజెన్సీల ఉల్లంఘన వెనుక మాస్కో హస్తం ఉన్నదని రష్యాపై ఆరోపణలు వచ్చాయి.
రష్యాకు చెందినవారు కనీసం తొమ్మిది ఏజెన్సీలు నెట్‌వర్క్‌లను హ్యాక్ చేయడానికి సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి విస్తృతంగా ఉల్లంఘనలకు పాల్పడినట్లు భావిస్తున్నారు. వారు యూఎస్ ప్రభుత్వం నుంచి రహస్యంగా సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించారని అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా అధ్యక్షుడయ్యేలా సాయం చేసే కార్యక్రమాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆమోదించారని అమెరికా అధికారులు గత నెలలో ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోండి: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
కరోనా ఎఫెక్ట్ : ఆక్సిజన్ కోసం రెండు రాష్ట్రాల తగువులాట..!
పిచ్‌బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్‌లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్‌లో లాక్‌డౌన్‌కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

