హైదరాబాద్ : అర్థిక సమస్యలతో పాటు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న జూనియర్ ఆర్టిస్ట్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం లో2లోని ఇందిరానగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న సునీత(37) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. భర్త సాంబయ్యతో గొడవల కారణంగా ఏడేండ్ల క్రితం విడిపోయిన సునీత ఇద్దరు పిల్లలను ఆనాధాశ్రమంలో చేర్పించింది.
ఒంటరిగా నివాసం ఉంటున్న సునీత ఇటీవల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది. ఒంటరితనం భరించలేకపోవడంతో డిఫ్రెషన్‌కు గురైన సునీత సోమవారం రాత్రి తన గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈమేరకు ఇంటి ఓనర్ కొల్లోజు శ్రీనివాసచారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.