న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ జియో ఫిజిస్ట్, కెమిస్ట్, ఇతర పోస్టుల భర్తీకి యూపీఎస్సీ (UPSC) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్లో దరఖాస్తులు మే 12 వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 67 పోస్టులు భర్తీ చేస్తున్నది. ఇందులో అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ జియోఫిజిస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్ ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం ఖాళీలు: 67
ఇందులో అసిస్టెంట్ కెమిస్ట్ 22, అసిస్టెంట్ జియోఫిజిస్ట్ 40, అసిస్టెంట్ డైరెక్టర్ 1, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 1, సీనియర్ లెక్చరర్ 1, సబ్ డివిజనల్ ఇంజినీర్ 2 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసి ఉండాలి. అనుభవం తప్పనిసరి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.25
దరఖాస్తులకు చివరితేదీ: మే 12
వెబ్సైట్: http://www.upsconline.nic.in