
యాదాద్రి, జనవరి 2: యాదాద్రి క్షేత్రాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి భగవంత్ ఖుబా కొనియాడారు. ఆదివారం ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఆయనకు బాలాలయ ముఖమండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి ప్రసాదం అందజేశారు. ఆ తరువాత మంత్రి నూతన ఆలయాన్ని పరిశీలించారు. యాదాద్రి క్షేత్రం దేశంలోనే మహాద్భుతంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. స్వామివారి దర్శనం జీవితంలో మర్చిపోలేని ఘట్టంగా అభివర్ణించారు. దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వేడుకొన్నట్టు ఆయన పేర్కొన్నారు.