లండన్: బ్రిటన్ కొత్త ప్రధాని ఎవరో మరికాసేపట్లో తెలనున్నది. లిజ్ ట్రస్ లేదా రిషి సునాక్.. వీరిలో ఎవరో ఒకరు ప్రధాని కానున్నారు. ప్రస్తుతం లిజ్ ట్రస్ ఆ రేసులో లీడింగ్‌లో ఉన్నారు. రిషి సునాక్ ప్రధాని పోరులో వెనుకబడినట్లు తెలుస్తోంది. బోరిస్ జాన్సన్ తన ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో.. పార్టీ నేతను ఎన్నుకునే క్రమంలో భారీ కసరత్తు జరిగింది. ముందు నుంచి రిషి సునాక్ ఆ రేసులో సంచలనం సృష్టించారు. కాసేపట్లో కన్జర్వేటివ్ పార్టీ నేతను అధికారికంగా ప్రకటించనున్నారు. సునాక్‌ను ట్రస్ బీట్ చేస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వెస్ట్‌మినిస్టర్‌లో ఉన్న కాన్ఫరెన్స్ సెంటర్లో ప్రధాని పేరును ప్రకటించనున్నారు. పార్టీ నేతగా ఎన్నికైన వ్యక్తి.. ఆ తర్వాత అందర్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే దేశంలో ఇంధన ఖర్చు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇక కొత్తగా ఎన్నికైన నేత ఆ సమస్యపై భారీ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఎనర్జీ బిల్లులపై ట్రస్ ఫ్రీజ్ను ప్రకటించే ఛాన్సు ఉంది. కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికైన వ్యక్తి ప్రధాని అవుతారు. ఆ తర్వాత స్కాట్లాండ్లో ఉన్న క్వీన్‌ను ప్రధాని కలుస్తారు.