UGC | న్యూఢిల్లీ, జనవరి 16: ప్రమాణాలకు అనుగుణంగా లేని పీహెచ్డీ డిగ్రీల కోర్సులను నిర్వహిస్తున్న రాజస్థాన్‌లోని మూడు విశ్వవిద్యాలయాలపై యూజీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా యూనివర్సిటీల పీహెచ్డీ డిగ్రీల ప్రోగ్రాములపై అయిదేండ్లపాటు నిషేధం విధించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే తమ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. చురులోని ఓపీజేఎస్, అల్వార్‌లోని సన్‌రైజ్, ఝన్ఝునూలోని సింఘానియా యూనివర్సిటీలు ఆఫర్ చేసే పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌లో చేరొద్దని.. అవి చెల్లవని హెచ్చరించింది.
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2025లో 90 కోట్లు దాటే అవకాశం ఉందని ‘ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్, 2024’ అంచనా వేసింది. 2024లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 88.6 కోట్లకు పెరిగింది. డిజిటల్ కంటెంట్ కోసం ఇండిక్ భాషల వినియోగం వృద్ధి చెందడంతో ఇంటర్నెట్ యూజర్లు 90 కోట్లు దాటిపోయే అవకాశం ఉందని అంచనావేసింది. ఇంటర్నెట్ యూజర్లలో 55 శాతం గ్రామీణ ప్రాంతాలవారే. వీరి సంఖ్య 48.8 కోట్లు.