ఉగాది పంచాంగం : ఈ ఏడాదిలో ధరలు ఎలా ఉంటాయంటే..?
ఉగాది పంచాంగం |

చైత్రం: నువ్వుల నూనె, బెల్లం ధరలు స్థిరంగా ఉంటాయి. నూలు, పట్టు దుస్తులు, ధాన్యాల ధరలు పెరుగుతాయి. వెండి, బంగారం ధరలు క్రమంగా పెరుగుతాయి. నెయ్యి, తేనె, కొబ్బరి ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. జొన్నలు, పాడి ఉత్పత్తుల ధరలు స్థిరం. కంద, ద్రాక్ష ధరలు తొలుత తగ్గి తిరిగి పెరుగుతాయి. సిమెంటు, ఇసుక, ఇటుక ధరలు ముందు పెరిగి తర్వాత తగ్గుతాయి. ఫ్యాన్సీ వస్తువుల ధరలు నిలకడగా ఉంటూనే నెలాఖరుకు పెరుగుతాయి. చక్కెర, నూనె ధరలు స్థిరంగా ఉంటాయి. మిర్చి ధర తగ్గుతుంది.
వైశాఖం : ధాన్యం, బెల్లం, చింతపండు ధరలు పెరుగుతాయి. మిర్చి ధర తగ్గి మళ్లీ పెరుగుతుంది. బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. పట్టు, నూలు దుస్తుల ధరల్లో స్వల్ప పెరుగుదల. కూరగాయల ధరలు అధికం అవుతాయి. కొబ్బరి, ఆలుగడ్డలు, మినుములు, ఉలవలు, పెసర్ల ధరలు నిలకడగా ఉంటాయి. కంచు ధర మోగుతుంది. యంత్ర పరికరాలు, స్టీలు, వేరుశనగ, నువ్వుల ధరల్లో మార్పు ఉండదు. అల్లం, పూల ధరలు పెరుగుతాయి.
జ్యేష్ఠం : ధాన్యం ధరలు కొద్దిగా పెరిగి స్థిరంగా ఉంటాయి. యంత్ర పరికరాల ధరలు నిలకడగా ఉంటాయి. బెల్లం, పసుపు, కొబ్బరి ధరల్లో మార్పుండదు. బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతాయి. ద్రాక్ష, మిర్చి ధరలు తగ్గుముఖం పడతాయి. నూలు, పట్టు దుస్తుల ధరలూ తగ్గవచ్చు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతాయి. పశుగ్రాసం ధరలు స్థిరంగా ఉండి అకస్మాత్తుగా పెరుగుతాయి. ఆవాలు, ఇత్తడి, కంచు, పప్పుధాన్యాల ధరలు తగ్గుతాయి.
ఆషాఢం : ధాన్యం, కొబ్బరి ధరలు తగ్గుతాయి. బెల్లం, చక్కెర ధరలు ముందు పెరిగి, తర్వాత తగ్గుతాయి. పట్టు, నూలు దుస్తులు, పప్పుధాన్యాల ధరలు తగ్గుతాయి. నిత్యావసర వస్తువులు ప్రియం అవుతాయి. దుంపల ధరలు స్థిరంగా ఉంటాయి. మినుములు, జొన్నలు, పెసర్ల ధరలు తగ్గి పెరుగుతాయి. సుగంధ ద్రవ్యాలు, నూనె, కలప, సిమెంటు, రంగుల ధరలు పెరుగుతాయి. బంగారం, వెండి, యంత్ర పరికరాల ధరలు స్థిరంగా ఉంటాయి.
శ్రావణం: బంగారం, వెండి, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ధరలు పెరుగుతాయి. దుస్తుల ధరలు స్థిరంగా ఉంటాయి. చింతపండు, కొబ్బరి, మిర్చి ధరల్లో మార్పు ఉండదు. స్టీలు, ఇనుము ధరలు తగ్గినట్టే తగ్గి పెరుగుతాయి. గోధుమలు, బెల్లం, రాగులు, ఉల్లిగడ్డల ధరలు స్థిరంగా ఉంటాయి. ఆలుగడ్డ ధర తగ్గుతుంది.
భాద్రపదం : బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉంటాయి. చక్కెర, బెల్లం, దుస్తులు, కొబ్బరి, ధాన్యం, గోధుమలు, పసుపు, పప్పుధాన్యాలు, మక్కజొన్న, సుగంధ ద్రవ్యాల ధరలు పెరుగుతాయి. కాయగూరల ధరలు మళ్లీ పెరుగుతాయి. ఉలవలు, పెసర్లు, పశుగ్రాసం ధరలు స్థిరంగా ఉంటాయి.
ఆశ్వీయుజం: కందులు, గోధుమలు, రాగి, దూది, ఉన్ని, బంగారం, వెండి, బెల్లం, ఉలవలు, పెసర్లు, మినుములు, ఆవాల ధరలు స్థిరంగా ఉన్నట్టే ఉండి క్రమంగా పెరుగుతాయి. పూలు, జొన్నల ధరలు క్రమేపీ తగ్గుతాయి. ధాన్యం, బాదం, కొబ్బరి, కంద, యంత్ర పరికరాలు, స్టీలు ధరలు పెరుగుతాయి. ఇత్తడి, కంచు,నూనెలు, గృహోపకరణాలు, దుస్తుల ధరలు స్థిరంగా ఉంటాయి.
కార్తీకం : సుగంధ ద్రవ్యాలు, పండ్ల ధరలు పెరుగుతాయి. తమలపాకులు, వివిధ ధాన్యాలు, బంగారం, వెండి, కందులు, పట్టు, దూది, ఉన్ని దుస్తుల ధరలు తగ్గుతాయి. పూలు, జొన్నల ధరలు తగ్గి మళ్లీ పెరుగుతాయి. కొబ్బరి, దుంపల ధరలు పెరిగి, స్థిరంగా ఉంటాయి. సుగంధ ద్రవ్యాలు, ఇనుము, స్టీలు, యంత్ర పరికరాల ధరలు పెరుగుతాయి. నూనెలు, గృహోపకరణాల ధరలు స్థిరంగా ఉంటాయి.
మార్గశిరం: ధాన్యాల ధరలు స్థిరంగా ఉంటాయి. కొబ్బరి, దుంపలు, పసుపు, పట్టు, కూరగాయలు, మినుములు, కందులు, ఆవాలు, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు ధరలు తగ్గుతాయి. బెల్లం, చక్కెర, పూలు, కంచు, ఇత్తడి, యంత్ర పరికరాలు, స్టీలు ధరలు పెరుగుతాయి.
పుష్యం: పూలు, పండ్లు, బంగారం, వెండి, రాగి, గోధుమలు, కందులు, పట్టు, దూది, వస్త్రముల ధరలు స్థిరంగా ఉంటాయి. బెల్లం, మినుములు, ఆవాల ధరలు పెరిగి తర్వాత తగ్గుతాయి. కొబ్బరి, ఆలుగడ్డలు, ఉలవలు, పెసర్లు, పప్పుధాన్యాలు, ఇత్తడి, కంచు, ఇనుము, స్టీలు, యంత్ర సామాగ్రి, సుగంధ ద్రవ్యాలు, రత్నాలు, గొంగళ్ల ధరలు పెరుగుతాయి.
మాఘం : దుస్తులు, కందులు, బంగారం, వెండి, గోధుమల ధరలు తగ్గుతాయి. పూలు, జొన్నలు, దూది, పట్టు వస్త్రము, ధాన్యం, ఇనుము, యంత్ర పరికరాలు, స్టీలు ధరలు పెరుగుతాయి. కొబ్బరి, ఆలుగడ్డలు, మినుములు, ఆవాలు, చెరకు, చక్కెర, ఇత్తడి, కంచు ధరలు తగ్గుతాయి. నూనెలు, సుగంధ ద్రవ్యాల ధరలు స్థిరంగా ఉంటాయి.
ఫాల్గుణం : సుగంధ ద్రవ్యాలు, గొంగళ్లు, రత్నాల ధరలు తగ్గుతాయి. ధాన్యాలు, బంగారం, వెండి, దూది, పట్టు దుస్తుల ధరలు తగ్గుతాయి. పూలు, మినుములు, ఆవాలు, బెల్లం, చక్కెర, ఇత్తడి, కంచుల ధరలు తగ్గుతాయి.ఉలవలు, పెసర్లు, కొబ్బరి, ఆలుగడ్డలు, యంత్ర పరికరాలు, పండ్లు, స్టీలు ధరలు పెరుగుతాయి. నిత్యావసర వస్తువుల ధరలు నిలకడగా ఉంటాయి.
ఇవికూడా చదవండి..
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు
‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్
ఉగాది పంచాంగం : అభివృద్ధి పథంలో తెలంగాణ
రెండు కాళ్లు, మూడు చేతులతో.. ఒడిశాలో జన్మించిన అవిభక్త కవలలు
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
ఎఫ్ 3 చిత్రంలో వకీల్ సాబ్ బ్యూటీ..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

