చెన్నై: సంస్కృతం ఒక మృత భాష అని, అయినప్పటికీ దానికి పెద్దయెత్తున నిధులు కేటాయిస్తూ, తమిళ భాషపై కేంద్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతున్నదని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ శుక్రవారం విమర్శించారు. ‘ఒక వైపు మీరు తమిళ భాషను సంరక్షిస్తున్నట్టు నటిస్తూనే, మరో వైపు హిందీ, సంస్కృత భాషలను మా విద్యార్ధులపై రుద్దాలని ప్రయత్నిస్తున్నారు.
ఎందుకంటే వారు తమిళం చదవాలని మీరు కోరుకోవడం లేదు. ఇదెక్కడి న్యాయం?’ అని ఆయన ప్రశ్నించారు. ‘ త్రిభాషా విధానాన్ని అంగీకరిస్తేనే తమిళనాడుకు నిధులు ఇస్తామని అంటున్నారు. అలాంటప్పుడు తమిళ భాషాభివృద్ధికి మీరు చేసిందేమిటి?’ అని ఆయన నిలదీశారు.